ETV Bharat / state

MLC ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలపై ప్రత్యేక గుర్తు - Present MLC Elections in Telangana

EC Guidelines for MLC Elections in Telangana : తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎన్నికలు జరిగే రెండు స్థానాలకు.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యాలెట్‌ పత్రాలపై ప్రత్యేక గుర్తు ముద్రించాలని తెెెెెెలిపింది.

MLC Elections in Telangana
MLC ఎన్నిక
author img

By

Published : Feb 15, 2023, 10:03 AM IST

EC Guidelines for MLC Elections in Telangana : తెలంగాణ రాష్ట్రంలో రెండు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే వీటిలో అక్రమాలకు తావు లేకుండా బ్యాలెట్ పేపర్లపై ప్రత్యేక గుర్తును ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానం, మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్​ను బ్యాలెట్​ పత్రాలతో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది .

ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం జారీ చేసిన బ్యాలెట్ పత్రాలు కాకుండా.. నకిలీ పత్రాలతో ఓటు వేసే ప్రమాదాన్ని నిలువరించే విషయమై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ఓటర్లు ఓటు వేశాక బ్యాలెట్‌ పత్రాన్ని నిర్ధారిత నమూనాలో మడతపెట్టి బ్యాలెట్‌ బాక్స్‌లో వేస్తారు. ఈ క్రమంలోనే ప్రత్యేక గుర్తు ముద్రించిన భాగాన్ని పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల అధికారికి చూపించి బాక్స్‌లో వేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆమేరకు బ్యాలెట్‌ పత్రంపై ప్రత్యేక గుర్తు, పోలింగ్‌ కేంద్రం నంబరు ముద్రించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది.

హైదరాబాద్‌ మండలి ఓటర్లు 118 మంది: స్థానిక సంస్థల కోటా హైదరాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి.. 118 మంది ఓటర్లతో ఎన్నికల సంఘం జాబితాను రూపొందించింది. ఇక్కడ 127 మందికి ఓటు హక్కు ఉన్నా.. తొమ్మిది మంది సభ్యులు లేకపోవటంతో ఆ సంఖ్య 118కి పరిమితమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ ఇటీవల మరణించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని 8 మంది సభ్యులు నియోజకవర్గంలో ఓటర్లు కాగా.. ఈ పాలకవర్గం ఇటీవల రద్దయింది. దీంతో ఆ మేర ఓటర్లు తగ్గారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.