కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు పాయకాపురంలోని సీపీఎం కార్యాలయంలో డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆవిర్భావ సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువజన సంఘాలలో రెండు కోట్లకుపైగా సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం డీవైఎఫ్ఐ అని నాగేశ్వరావు పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా యువతకు ఉపాధి పథకాలు, చదువుకునే యువకులకు అనేక రకాల సలహాలు, సూచనలు ఇచ్చే అనేక కార్యక్రమాలు డీవైఎఫ్ఐ చేపట్టిందన్నారు.
పాయకాపురంలో డీవైఎఫ్ఐ ఆవిర్భావ వేడుకలు - in vijayawada dyfi formation day
డీవైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలన్ని పురస్కరించుకుని విజయవాడ శివారు పాయకాపురంలోని సీపీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్లుగా యువతకు సలహాలు, సూచనలు ఇస్తూ వస్తుందని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు.