ETV Bharat / state

'ఆధార్‌ లేక కొవిడ్‌ పరీక్షలు, వైద్యసేవలకు దూరం'

author img

By

Published : Jul 26, 2020, 7:43 AM IST

కరోనా వైరస్‌ పరీక్షలకు ఆధార్‌ తప్పనిసరి చేయటంతో చాలామంది ప్రజలు కొవిడ్ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ వెల్లడించారు. ఇలాంటి కఠిన షరతులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

pv ramesh
pv ramesh

ఆధార్‌ కార్డులు లేకపోవడంతో చాలామంది పేదలు, నిరక్షరాస్యులు, పెద్దలు, శిశువులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని, వైద్యసేవలు పొందలేకపోతున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ పరీక్షలకు ఆధార్‌ తప్పనిసరని భారత వైద్య పరిశోధనా మండలి పేర్కొనడమే దీనికి కారణమని ట్విటర్‌ వేదికగా శనివారం ప్రస్తావించారు. ఇలాంటి కఠిన షరతులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, న్యాయస్థానాలు, ఆధార్‌ సీఈవో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి

కరోనా బాధితులను బెంబేలెత్తిస్తున్న బెజవాడ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.