వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో తాపీ కార్మికుల సంక్షేమ సంఘ నూతన భవనాన్ని మంత్రులు కొడాలి నాని, జయరాంలు శనివారం ప్రారంభించారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లడం వల్లే ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిచి.. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడుతోందని కొడాలి నాని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని అన్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపైనా ఆయన స్పందించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం చంద్రబాబు అసమర్థత. తెదేపా తరఫున పోటీ చేసిన 106 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని తెదేపాను జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు... ముఖ్యమంత్రి జగన్‌ను ఢీ కొడతాననడం అవివేకం. జీహెచ్ఎంసీ ఫలితాలే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెదేపాకు పునరావృతం అవుతాయి- కొడాలి నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి
ఇదీ చదవండి