కృష్ణాజిల్లా కోడూరు మండలం కృష్ణానదిపై ఉన్న ఉల్లిపాలెం- భవానిపురం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. వచ్చిపోయే వాహనాలపై నిరంతర నిఘా ఉంచాలని.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. ఎక్కువమంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడి ఉండకుండా చర్యలు తీసుకోవాల ఆదేశించారు. విధులు నిర్వహించే సిబ్బంది.. తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి సూచించారు.
విధుల నిర్వాహణలో.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహిస్తే.. వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయక కార్యక్రమాలు చేపట్టే వారు సంబంధిత అధికారుల ఆదేశాలు, అనుమతుల మేరకే పంపిణీ నిర్వహించేలా చూడాలన్నారు. అనంతరం కోడూరు పరిధిలోని మద్యం దుకాణాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. దుకాణ యజమానులను భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: