ETV Bharat / state

దొండ రైతుల కష్టాలు.. లక్షల్లో నష్టాలు

author img

By

Published : Jul 12, 2020, 6:58 PM IST

దొండ రైతులకు అండ లేకుండా పోతోంది. కరోనా విజృంభణ కారణంగా మార్కెట్‌ సౌకర్యం అంతంత మాత్రంగానే అందుబాటులో ఉండటంతో సాగుదారులు విక్రయాలకు అవకాశం లేక నష్టపోతున్నారు. కొనే దిక్కు లేక.... పండించిన పంట మార్కెట్‌కు చేర్చలేక... చేల గట్లపైనే బస్తాలకు బస్తాలు పందిళ్ల నుంచి కోసి రోజుల తరబడి పడేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో దొండ సాగుదారులు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు.

donda farmers facing problems in kirshna dst due to lockdown

బస్తా... రెండుబస్తాలు కాదు... ఏకంగా పదుల సంఖ్యలోనే బస్తాల కొద్దీ దొండలను కుప్పలుగా పారబోస్తున్నారు. కేజీల లెక్కన కాకుండా టన్నుల కొద్దీ పంట దిగుబడిని పొలం గట్టు శివారులోనూ కాలువల్లోనో చెత్తకుప్పల్లోనూ పడేస్తున్నారు. ఇదంతా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో దొండ సాగు చేస్తోన్న రైతుల ప్రస్తుత పరిస్థితి.

చిన ఓగిరాల, పెద ఓగిరాల చుట్టుపక్కలే సుమారు 200 ఎకరాలకుపైగా దొండకాయ సాగు చేశారు. రోజుకి 15 వందల బస్తాలకు పైగా దొండకాయలు మార్కెట్ కి వస్తాయి. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలకు దొండ ఎగుమతి చేస్తుంటారు. నాలుగు నెలలుగా కరోనా మహమ్మారితో ముఖ్యంగా కూరగాయల రైతులు వారి పంట విక్రయాలకు నానా అవస్థలు పడుతున్నారు.

కూరగాయలు అమ్ముకునేందుకు పరిమిత కాల వ్యవధినే ప్రభుత్వం ప్రకటించడంతో.... రైతులు ఏ రోజుకారోజూ కోసిన దొండకాయలను పూర్తిగా విక్రయించలేకపోతున్నారు. ముందురోజు కోసిన దొండకాయలను మార్కెట్లోకి తరలిస్తే నాణ్యత సరిగా లేదని కొనుగోలుకు ఎవరూ ఇష్టపడడంలేదు.

ఇతర కూరగాయ పంటల కంటే దొండ పంటకు పెట్టుబడులు ఎక్కువ కావటంతో... ప్రస్తుత పరిస్థితులలో వివిధ రకాలుగా రైతులు లక్షల రూపాయల్లో నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. దొండకాయ కోసినా నష్టమే, కోయకుండా పందిళ్లకు ఉంచినా నష్టమే అన్నట్లు ఉంది.

ధర మరీ తక్కవ...

దొండకాయ ధర విషయానికి వస్తే.... అన్నీ ఖర్చులూ పోతే రైతుకి కిలోకి 50 పైసలు కూడా దక్కటంలేదు. రైతు బజార్లలో కిలో ధర 10 రూపాయలు ఉంటే, బహిరంగ మార్కెట్లో 15 రూపాయలు ధర పలుకుతోంది. కాయ కోత, రవాణా ఖర్చులు కలిపితే 50 కేజీల బస్తాకి రైతు చేతి డబ్బులే 200 నుంచి 250 ఖర్చు అవుతుంటే... రైతుకి బస్తాకి 50 రూపాయల అందుతోంది.

మూడేళ్లు ఉండే దొండ పందిర్లకు ప్రతినెలా కనీసం 10 వేల రూపాయలు పెట్టుబడి తప్పనిసరి. ప్రస్తుతం నేలకొరుగుతున్న దొండ పందిళ్లను కాపాడుకోవటం రైతులకు కష్టంగా ఉంటోంది. మార్కెట్లో పంట దిగుబడికి ధర లేకపోవటం, కరోనా పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు సరకును పంపలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి

యువతి ప్రాణాన్ని బలిగొన్న మాస్క్ వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.