దీపాల వెలుగుల కాంతి మధ్య విజయవాడ కళకళలాడింది. కాకర పువ్వొత్తుల కాంతులతో ఆనందాన్ని నింపుతూ... ప్రతి ఇంటి ముంగిట కాంతులు విరజిమ్మాయి. చిన్నా, పెద్దా వెలిగించిన చిచ్చుబుడ్డులు చిటపటలాడాయి. వెలుగుల పండుగ దీపావళిని అందరూ కలిసి వేడుకగా జరుపుకొన్నారు. దీపాల వెలుగులకు తోడు..... బాణాసంచా కాల్చి మరింత ఉత్సాహంగా గడిపారు.