ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం చేయాలని వేడుకోలు ఉప్పు సాంద్రత ఎక్కువ ఉండి, ఎలాంటి పంటలు పండని చౌడు భూముల్లో దివిసీమ రైతులు రొయ్యలు సాగుచేసి.. ఇతర ఎగుమతి చేసి విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించేవారు ఒకప్పుడు. సముద్రం ఆటుపోటులకు ఉప్పునీరు కృష్ణా నది ద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రవహించడం వలన ... నదికి ఇరువైపులా ఉన్న 20 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో 100 నుండి 120 రోజుల్లో చేతికొచ్చే... రొయ్యసాగును గత 20 సంవత్సరాలుగా సాగుచేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో రొయ్యలకు వైట్ఘాట్, ఎబ్రో, వైట్‌స్పాట్ అనే వైరస్లు సోకి పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బారిన పడుతున్నామని ఆక్వారైతులు ఆవేదన చెందుతున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న మత్స్యశాఖ అధికారులు తగిన సూచలిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చిన ఆక్వారైతులు అంటున్నారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డలో ఆక్వాకల్చర్ కోసం ప్రత్యేక ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని శిలాఫలకం వేశారు... కానీ ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు ప్రారంభంకాలేదన్నారు. ప్రభుత్వ ల్యాబ్ అందుబాటులో లేక.. నీటి పరీక్షలు కోసం ప్రైవేట్ ల్యాబ్‌లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నారు. వనామి రొయ్యలకు వచ్చే వ్యాధులు, వైరస్‌లపై మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పంచింది రైతులకు అవగాహన కల్పించాలని ఆక్వారైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :
ఆక్వా రైతుల చెంతకు సాంకేతికత.. త్వరలో 36 ప్రయోగశాలలు!