ETV Bharat / state

మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు జిల్లా బహిష్కరణ

కృష్ణాజిల్లా మచిలీపట్నం మార్కెట్​ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో నిందితుడైన చింతా చిన్నిని జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చింతా చిన్ని
చింతా చిన్ని
author img

By

Published : Mar 19, 2021, 12:11 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం మార్కెట్​ యార్డు మాజీ ఛైర్మన్​, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నిని జిల్లా బహిష్కరణ చేస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలలపాటు బహిష్కరణ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చారు. మోకా భాస్కరరావు హత్య కేసులో చింతా చిన్ని ప్రధాన నిందితుడని.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కోర్టు తీర్పుతో ఇటీవల ఎన్నికల కోసం చింతా చిన్ని మచిలీపట్నం వచ్చాడు. మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మపై కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయాడు. ఆమె ఎన్నికలలో గెలిచి మచిలీపట్నం మేయర్​గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చూడండి. వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.