Hamsaladevi tourists problems: హంసలదీవి.. కృష్ణ జిల్లా దివిసీమలోని ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తుంది. పురాణ కథనాల ప్రకారం.. సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ వెళుతోన్నకాకి.. కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగి లేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసలదీవిగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం చెబుతోంది. ఈ ప్రాంతంలో.. పచ్చటి మడ అడవులు, బుడిబుడి అడుగుల తాబేళ్లు, ఎర్రటి పీతలు, నేలపై ఆడుకునే మొప్పడాయ చేపలు, నక్కలు, రకరకాల పక్షులు ఇలా ఒకటేమిటి.. సమస్త జీవరాశిని ఇక్కడ చూడవచ్చు. హంసలదీవి, పాలకాయతిప్ప సమీపంలోనే కృష్ణావన్యప్రాణి అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడి పకృతి సౌందర్యానికి, ఆహ్లాద వాతావరణానికి అందరూ తన్మయులు అవుతారు. అందుకే ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడ పకృతి చూసి మైమరిచి పోతుంటారు. అయితే సరైన వసతులు లేక సందర్శకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
దుస్తులు మార్చుకొనేందుకు కూడా ఏర్పాట్లు లేవు..
పాలకాయతిప్ప బీచ్ వద్ద కృష్ణమ్మ సాగర సంగమ ప్రదేశంలో.. స్నానమాచరించి ఆ తర్వాత హంసలదీవిలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యబామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. అయితే సరైన వసతులు లేక సందర్శకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. బీచ్ వద్ద తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. బీచ్‌లో స్నానమాచరించిన పర్యాటకులకు దుస్తులు మార్చుకొనేందుకు కూడా ఏర్పాట్లు లేవని పర్యాటకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పర్యటకుల కోసం తగు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఇదీ చదవండి: kodali Nani on Districts: ఎన్టీఆర్ పేరు పెడతానని అప్పుడే జగన్ హామీ ఇచ్చారు: కొడాలి నాని