Disabled woman suicide: సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం.. అడ్డగోలు నిబంధనలతో అమాయకులను బలిగొంటోంది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ మంజూరు విషయంలో సవాలక్ష సాకులు చూపిస్తూ అనర్హత వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులు మానసికంగా కృంగిపోయి ప్రాణాలు విడుస్తున్న దుస్థితి కనిపిస్తోంది.
Janasena Leaders on Volunteer: వాలంటీర్ నిర్వాకం.. పింఛన్ అడిగితే ఇంటికి నిప్పు పెట్టాడు
Outsourcing job పింఛన్ పునరుద్ధరించాలంటూ ఆమె చేసిన పోరాటం ఆగిపోయింది. తల్లికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఉందన్న సాకుతో.. తనకు పింఛన్ ఇవ్వకపోవడం ఆ దివ్యాంగురాలిని కుంగదీసింది. అధికారులు మొదలుకుని తమ ప్రాంత కార్పొరేటర్, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే వద్ద మొర పెట్టుకున్నా.. అరణ్య రోదనగా మిగిలిపోయింది. పింఛన్‌కు అన్ని అర్హతలు ఉన్నా.. సర్కారుపై పోరు సల్పే సత్తువలేక చివరికి.. ఉరి వేసుకు బలవన్మరణానికి పాల్పడింది విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌కు చెందిన ఇరువూరి ప్రశాంతికుమారి.
పింఛన్ నిలిచింది.. ఆమె గుండె ఆగింది
MLA Comments విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌కు చెందిన ఇరువూరి ప్రశాంతికుమారి(38), ఆమె తల్లి వెంకటనర్సమ్మతో కలిసి జీవిస్తున్నారు. నర్సమ్మ నైపుణ్యాభివృద్ధి సంస్థలో హౌస్‌కీపింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తండ్రి వెంకటేశ్వరరెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలియో బాధితురాలైన ప్రశాంతి బీఈడీ పూర్తి చేసింది. ఐదేళ్లపాటు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె.. కొంతకాలంగా బయటకు వెళ్లలేక, ఇంట్లోనే అల్లికలు, అలంకరణలు చేస్తోంది. కాగా, తల్లి ఉద్యోగి అనే సాకుతో అధికారులు గతేడాది ఆగస్టులో ప్రశాంతి కుమారికి దివ్యాంగుల పింఛన్ నిలిపేశారు. ప్రశాంతి పింఛన్ పునరుద్ధరించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరగని రోజంటూ లేదు. గడపగడప’కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఊర్మిళానగర్‌కు రాగా... ప్రశాంతి '‘నా పింఛను దొంగలు'’ అంటూ పలకపై రాసి ప్రదర్శించింది. కార్పొరేటర్ కోటిరెడ్డి ఇంటిముందూ నిరసన తెలపడంతో అధికార పార్టీ తీవ్రంగా పరిగణించింది. పైగా, ప్రశాంతి పింఛను తొలగించడంలో తప్పే లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. ఆపై ఆమె వినతికి ఎక్కడా మోక్షం లభించకపోవడం గమనార్హం.
పెన్షన్ కోసం వృద్ధురాలి అవస్థలు.. విరిగిన కుర్చీ సాయంతో ఎండలో కి.మీల నడక
Leagal Action పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయని... ప్రశాంతి తన ఆవేదనను స్థానిక జనసేన పార్టీ నాయకులతో పంచుకోగా.. జనసేన నగర అధ్యక్షుడు పోతిన వెంకటమహేశ్ పలుమార్లు ఆమె నివాసం వద్దకు వచ్చి సమస్యపై ఆరా తీశారు. ఈ క్రమంలో కొన్ని నెలలపాటు పార్టీ వారే కొంత సొమ్ము అందించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అవివాహితురాలైన ప్రశాంతి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి ఆమె తల్లి వెంకటనర్సమ్మ పేర్లు ఒకే బియ్యం కార్డులో ఉండటంతో పింఛన్ పునరుద్ధరించలేమని అధికారులు తేల్చారు. దీంతో న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న ప్రశాంతి.. ‘కోర్టులో కేసు ఫైల్ చేసే విషయమై శుక్రవారమే ఓ న్యాయవాదిని ఫోన్‌లో సంప్రదించారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో.. శనివారం ఉదయం తల్లి ఉద్యోగానికి వెళ్లాక ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పొరుగింటి వారు గమనించేలోగా.. అప్పటికే ఊపిరి వదిలింది. తన కూతురు అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని ప్రశాంతి తల్లి వెంకటనర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.