కూల్చివేతలతో ప్రారంభించిన జగన్ పాలన విధ్వంసాలే ప్రధాన ఎజెండాగా సాగుతుందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆరోపించారు. తెలుగు జాతి గర్వించే ఎన్టీఆర్ విగ్రహాన్ని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కూల్చివేయటంపై తెలుగు జాతి జగన్ను క్షమించదని విమర్శించారు. ఇది ఒక్క ఎన్టీఆర్కే కాదు తెలుగుజాతికే అవమానకరమన్నారు. జగన్... ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన తెలుగు వారి మనసుల్లో నుంచి ఆయన ప్రతిరూపాన్ని తొలగించలేరని గోనుగుంట్ల స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...