ETV Bharat / state

DIET Agreement: కాలిఫోర్నియా యూనివర్సిటీతో కృష్ణా జిల్లా ఇంజినీరింగ్ కళాశాల ఒప్పందం

author img

By

Published : Nov 30, 2021, 1:48 PM IST

DIET Agreement with the silicon andhra University: కృష్ణా జిల్లా గంగూరు ధనేకుల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.. కాలిఫోర్నియాలోని సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది. తమ కళాశాల విద్యార్థులకు పీజీలో ప్రవేశం కోసం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ కొత్తగా కంప్యూటర్ సైన్స్​లో కూడా మాస్టర్స్ కోర్సును తీసుకొస్తోందని సిలికాన్‌ ఆంధ్ర అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌ తెలిపారు.

Agreement
Agreement

DIET Agreement with the silicon andhra University: కాలిఫోర్నియాలోని సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీతో కృష్ణా జిల్లా గంగూరు ధనేకుల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది. కళాశాల విద్యార్థులకు పీజీలో ప్రవేశం కోసం సిలికాన్‌ ఆంధ్ర అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌, ఏఐసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్ బుద్దా చంద్రశేఖర్‌, కళాశాల డైరెక్టర్ రవిప్రసాద్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

New courses in Silicon Andhra University: సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ కొత్తగా కంప్యూటర్ సైన్స్​లో కూడా మాస్టర్స్ కోర్సును తీసుకువస్తుందని.. విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని కూచిబొట్ల ఆనంద్‌ తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, హిందూస్థానీ మ్యూజిక్, కర్నాటిక్ సంగీతం, కూచిపూడి, భరతనాట్యంలో స్నాతకోత్తర విద్యను విశ్వవిద్యాలయంలో అందిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీకి దగ్గరలో 70 ఎకరాల స్థలంలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణానికి సుమారు రూ.3,500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ విశ్వవిద్యాలయం పూర్తి చేసి భారతీయ విద్యార్థులతోటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారికి అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని కూచిబొట్ల ఆనంద్‌ అన్నారు.

ఇదీ చదవండి

Chennupati Jagadish: తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్​కి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.