కరోనా రోగులకు అత్యంత అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలకు అనుగుణంగా వేగంగా, సురక్షితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సకాలంలో ఆక్సిజన్ అందేలా పోలీస్ శాఖ విశేషమైన కృషి చేస్తోందన్నారు.
ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్లను మ్యాపింగ్ చేసి అక్కడ నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇతర రాష్ట్రాల కంట్రోల్ రూంలతో సమన్వయం చేసుకుంటూ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు రాష్ట్రం మీదుగా వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్లకు సైతం ఎస్కార్ట్ వాహనాలు, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఇదీ చూడండి: