దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయలకు దేవాలయాలే మూలమని పేర్కొన్నారు.
దుర్గగుడిలో వెండి సింహాల అపహరణలో చాలా వివాదంతో పాటు.. అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దుర్గమ్మ దయతో నేరస్తుడిని పట్టుకున్నాము. అంతర్వేది రథం దగ్ధం ఘటనతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఈ ఘటనల తర్వాత 47 వేల 734 దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము . మరో 59 వేల 443 దేవాలయాలను సర్వే చేసి వాటికి జీయో ట్యాగింగ్ చేయనున్నాము. 23 వేల 832 ఆలయాల్లో గ్రామ రక్షక దళాలను పెట్టి చర్యలు చేపడతాం. గతంలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన 4,873 మందిని విచారించి.. 373 మంది నిందితులను అరెస్ట్ చేశాము. - డీజీపీ గౌతమ్ సవాంగ్
ఇదీ చదవండీ.. గవర్నర్ చెంతకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్.. వేర్వేరుగా భేటీలు