ETV Bharat / state

ఘనంగా నూజివీడు గంగానమ్మ తల్లి జాతర - గంగానమ్మ తల్లి జాతర ఉత్సవం

నూజివీడు గంగానమ్మ తల్లి జాతర ఉత్సవాన్ని భక్తులు ఉత్సాహభరితంగా నిర్వహించారు. మేళతాళాలు డప్పులు వాయిద్యాలతో, భక్తుల నృత్యాల నడుమ అమ్మవారికి నివేదనలు సమర్పించారు.

Ganganamma god
నూజివీడు గంగానమ్మ తల్లి జాతర ఉత్సవం
author img

By

Published : Nov 1, 2020, 2:33 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో గంగానమ్మ తల్లి జాతర ఉత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని అజరయ్య పేటలో శ్రీ శార్వరి నామ సంవత్సర నిజ ఆశ్వీయుజ బహుళ పాడ్యమి సందర్భంగా.... గంగానమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు డప్పులు వాయిద్యాలతో, భక్తుల నృత్యాల నడుమ అమ్మవారికి నివేదనలు సమర్పించి...మొక్కులు తీర్చుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలలోని ప్రజలను రక్షించాలని గంగానమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేసి, అన్నసంతర్పణ కొనసాగించారు. అమ్మవారి నామ స్మరణతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఇదీ చదవండి:

తిరుమలలో సర్వదర్శనం టికెట్ల కోసం తోపులాట.. భక్తులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.