రెండవ బాసరగా పేరుగాంచిన కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఏటా దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగేవి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది.
ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడేదని స్థానికులు తెలిపారు. కొవిడ్ కారణంగా భక్తుల కోలాహలం పూర్తిగా తగ్గిందని వారు తెలిపారు. వచ్చే కొద్ది మంది భక్తులు సామాజిక దూరం పాటిస్తూనే మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఇదీ చదవండి: