ETV Bharat / state

ఆలయంలో ఆంక్షలు.. నాగపుట్ట వద్ద పోటెత్తిన భక్తులు - krishna district latest news

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని సుబ్రహ్మణ్యశ్వేర స్వామి ఆలయం వద్ద ఉన్న పుట్ట వద్ద ఆదివారం భక్తుల తాకిడి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చిన్నారులు, వృద్ధులను ఆలయంలోకి అనుమతించకపోవటంతో... స్వామి దర్శనానికి వచ్చిన చాలా మంది భక్తులు అక్కడి పుట్ట వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు.

Mopidevi temple
Mopidevi temple
author img

By

Published : Aug 30, 2020, 6:06 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ముఖ్యంగా ఆది, గురు వారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం కొవిడ్ కారణంగా పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులను ఈ ఆలయంలోకి అనుమతించడం లేదు.

Mopidevi temple
సుబ్రహ్మణ్యశ్వేర స్వామి ఆలయం

మోపిదేవి ఆలయానికి ఎక్కువమంది భక్తులు తమ చిన్నారుల తలనీలాలు తీయించడం, అన్నప్రాసన, కుట్టుపోగులు వంటి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ప్రస్తుతం చిన్నారులను ఆలయంలోకి అనుమతించకపోవటంతో వారు.. ఆలయానికి దగ్గరలోని నాగపుట్ట వద్దకు వెళ్తున్నారు. తమ పిల్లలకు అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు.

Mopidevi temple
పుట్ట వద్దే మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆలయంలోకి అనుమతించాలని భక్తులు కోరుతున్నారు. వయసు నిబంధన తొలగించాలంటూ ఉన్నతాధికారులకు లేఖ పంపామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి లీలా కుమార్ తెలిపారు. అధికారులు ఇంకా అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.

ఇదీ చదవండి

కారు ఢీకొడితే ఎగిరి బైక్​ కింద పడ్డాడు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.