ETV Bharat / state

'ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సీఎం సమాధానం చెప్పాలి'

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని దేవినేని ఉమా చెప్పారు.

author img

By

Published : Dec 8, 2019, 2:04 PM IST

devineni uma questions to ycp on hiking rtc charges
వైకాపాపై మండిపడ్డ దేవినేని
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్న దేవినేని ఉమా

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏటా రూ.700 కోట్లు భారం పడుతుందని తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. అమరావతి అంతా సెక్షన్144 అమల్లో ఉందని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వంలో సామాన్యులపై ధరలు, ఛార్జీల భారం వేయలేదని గుర్తు చేశారు. ఉల్లిగడ్డ కోసం రైతుబజార్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని...జగన్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగాయని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్, బెట్టింగ్, ఇసుక మాఫియా నడుస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

'స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కమిటీల ఏర్పాటు ఎంతో కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.