గుడివాడ వలివెత్తి పాడు పంచాయతీలో 66 మంది ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు మంత్రి కొడాలి నాని వారిని ఖాళీ చేయాలని బెదిరించడం తగదని మాజీమంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని ప్రశ్నించిన టీచర్ మీద కొడాలి నాని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కొడాలి నానిని భర్తరఫ్ చేసి కేసు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందని ఉమ వ్యాఖ్యానించారు.
రైతులు వైకాపా దగ్గర నుంచి కోరుకుంటుంది ఇదేనా అని ఆయన నిలదీశారు. నీటిపారుదలశాఖ మంత్రి జిల్లాలో సోమశిల డ్యాం ద్వారా రెండో పంటకు నీళ్లివ్వని అసమర్ధ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : వారికి హైదరాబాద్లో కాదు.. సొంత రాష్ట్రంలోనే క్వారంటైన్