కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో మల్లాది నాగేంద్రమ్మపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని తెదేపా మహిళా నేతలు ఆరోపించారు. కొబ్బరి పుల్లల కోసమని తోటకు వెళ్లి మంగళవారం ఆమె అనుమానస్పద స్థితిలో మృతి చెందగా.. ఇవాళ తెదేపా మహిళా నేతల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. ముమ్మాటికీ నాగేంద్రమ్మను అత్యాచారం చేసి హత్య చేశారని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ జడ్పీ ఛైర్మన్ గద్దె అనురాధ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే హత్య
తోలుకోడు ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. ఘటనపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెబుతూ ఎంతకాలం కాలం వెళ్లదీస్తారని ఆక్షేపించారు. హోం మంత్రి తోలుకోడు వచ్చి బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. నిదింతులను గుర్తించి కఠినంగా శిక్షించటంతో పాటు బాధిత కుటుంబానిక రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: