వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి రైతుల్లో ఆందోళన పెంచుతోందని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ప్రభుత్వం చేసే అప్పుల కోసం రైతుల జీవితాలు తాకట్టు పెడతారా అని.. ఉమ ప్రశ్నించారు.
రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా.. మీటర్లు బిగించి తీరుతామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల కలిగే అదనపు బారంపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: