ఆస్తి ఆధారిత పన్ను, చెత్త పన్నుకు సంబంధించిన జీవోలను.. ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెదేపా కార్పొరేటర్లను మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి వెళ్లకుండా.. పోలీసులు అడ్డుకోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణ లంక పోలీసు స్టేషన్లో ఉన్న తెదేపా, వామపక్ష నేతలను ఆయన పరామర్శించారు. సీఎం జగన్ తాడేపల్లి రాజప్రసాదంలో.. 144 సెక్షన్ అమల్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పరిపాలన లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
ఆగస్టు 1లోపు ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలి: హైకోర్టు