దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే.. తిరిగి తెదేపాకు పట్టం కడతాయని ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. గుడివాడ ప్రజలు తెదేపాను కోరుకుంటున్నారనీ.. ఇక్కడ అవినాష్ గెలుపు తథ్యమని చెప్పారు. రైతులు, మహిళలు, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై అసంతృప్తితో ఉన్నారని అవినాష్ అన్నారు. అధికారం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
నాటు తుపాకీతో సంచారం.. వ్యక్తి అరెస్టు