చంద్రబాబుపై కక్షతోనే రాష్ట్రంలో పోలవరం సహా వివిధ జలవనరుల ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి జగన్ ఆపేశారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలనకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో మేధావుల సలహాలకు కాకుండా బంధువుల సూచనలకు జగన్ విలువిస్తున్నారని ఆరోపించారు. ఏడు శాతంగా ఉన్న పోలవరం పనులను 70శాతo పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును, తెదేపా ప్రభుత్వాన్ని దూషించేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని దేవినేని విమర్శించారు.
ఇదీ చదవండి