కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు శ్రీ షిర్డీసాయిబాబా మందిరం వద్ద బయట ఉన్న బాబా విగ్రహాన్ని మంగళవారం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేశ్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
![Destruction of Sai Baba statue at Nidamanur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8819680_729_8819680_1600242479607.png)
బాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని తెదేపా, భాజపా నాయకులు పరిశీలించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, భాజపా నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఆంజనేయులు సాయి బాబా విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆలయం ముందు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు