ETV Bharat / state

దర్శనాలు కొనసాగించాలా వద్దా.. చెప్పండి: దేవాదాయ శాఖ - Government on Covid Latest News

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతులు ఇవ్వాలా లేదా అనే అంశంపై దేవాదాయ శాఖ స్పష్టత కోరుతూ... ప్రభుత్వానికి విజ్ఞాపన పంపింది.

దర్శనాలు కొనసాగించాలా వద్దా చెప్పండి :  దేవాదాయ శాఖ

author img

By

Published : Apr 20, 2021, 9:49 AM IST

కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో దర్శనాలకు భక్తులను అనుమతించాలా ? లేక మరిన్ని ఆంక్షలు విధించాలా అనే అంశాలపై సూచించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు..

కమిషనర్‌ కార్యాలయం నుంచి కీలక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అనేక ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులు కొవిడ్‌ బారినపడ్డారు. మరోవైపు.. కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో మే 15 వరకు భక్తులకు దర్శనాలు నిలిపేశారు. ఫలితంగా రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఆంక్షలు అమలుపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దర్శనాలు పూర్తిగా నిలిపేయాలా ? గంటకు కొంత మంది చొప్పున పరిమితంగా అనుమతించాలా ? అనే స్పష్టత ఇవ్వాలని అడిగింది. ఉత్సవాలు, కల్యాణాలను సైతం భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించడంపైనా ప్రతిపాదించారు.

మాస్క్ ఉంటేనే అనుమతి..

ప్రస్తుతం మాస్క్‌ ఉంటేనే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల మధ్య, క్యూ లైన్ల మధ్య దూరం ఉండేలా చూడటం, చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారిని అనుమతించకపోవడం వంటివి మరింత కఠినంగా అమలు చేయడంపైనా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇవీ చూడండి:

'ఏపీలో రైతాంగ పోరాట స్ఫూర్తి.. అమరావతి ఉద్యమమే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.