కర్నూలు జిల్లా పాములపాడు మండలం భానుకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద తేనెతీగల దాడిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భానుప్రకాష్ మృతి చెందారు. మంగళవారం హెడ్‌రెగ్యులేటర్ సముదాయాన్ని పరిశీలించేందుకు సిబ్బందితో వెళ్లారు. పరిశీలిస్తున్న సమయంలో సముదాయాల వద్ద ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భానుప్రకాష్ తప్పించుకోలేక మృతి చెందాడు. మిగతా సిబ్బంది తప్పించుకొని బయటపడ్డారు.
2007 బ్యాచ్‌కు చెందిన భాను ప్రకాష్... కడప జిల్లాలోని హైడ్రాలజీ డిపార్ట్మెంట్లో పని చేసి.. ఏడాదిన్నర కిందట బదిలీపై జిల్లాకు వచ్చి హెడ్ రెగ్యులేటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇదీ చూడండి. బుధవారం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్