ETV Bharat / state

లంకల మార్గం.. దినదిన గండం! - కృష్ణాజిల్లాలో పాడైన రహదారులు

కొల్లేరు లంకగ్రామాల రహదారులు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు నెలవుగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారిపోతున్నాయి. రోడ్డు పాడై ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మండవల్లి - ఇంగిలిపాకలంక రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులు

author img

By

Published : Oct 8, 2020, 2:04 PM IST

మండవల్లి - ఇంగిలిపాకలంక రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులు

కొల్లేరు లంకగ్రామాల రహదారులు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు నెలవుగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారిపోతున్నాయి. భారీ గోతులతో ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులను గురిచేస్తున్నాయి. రోడ్డు పాడై ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం అంబులెన్స్‌ వచ్చే వీలు కూడా లేదని ప్రజలు వాపోతున్నారు.అభివృద్ధికి ఎంచుకున్న ఆక్వారంగమే రోడ్లు పాడవడానికి కారణమవుతోంది. సామర్థ్యాన్ని మించిన అధిక బరువులతో మేతలు, చేపల లోడులతో వాహనాలు వెళ్లడంతోనే కొద్దికాలానికే మరమ్మతులకు గురవుతున్నాయి.

దెయ్యంపాడు గోపాలపురం తారురోడ్డుపై గోతిలో కూరుకుపోయిన లారీ​​​​​​​

పాడైన రహదారులివే..

* మండవల్లి- ఇంగిలిపాకలంక రోడ్డు నిర్మించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం ఈరోడ్డు పూర్తిగా నాశనమైంది. ఎక్కడ చూసినా భారీఎత్తున గోతులతో దర్శనమిస్తోంది. మండవల్లి, మూడతాళ్లపాడు, ఆనందపురంతో పాటు ఏలూరు వెళ్లేందుకు ఈ రహదారే దగ్గర మార్గం.

* దెయ్యంపాడు- గోపాలపురం 14 కి.మీ. రోడ్డును 2014లో అప్పటి ఎంపీ కావూరి సాంబశివరావు నిధులు రూ.9.15 కోట్లతో నిర్మించారు. ఈరోడ్డు వేసి మొదటి ఏడాది నుంచే మరమ్మతులు తప్పలేదు.. రోడ్డుకు ఒక పక్క మోటూరు చానెల్‌ ఉండడంతో పాటు రహదారి నిర్మాణంలో సరైన నిబంధనలు పాటించకపోవడంతో వేసిన ఏడాది నుంచే మరమ్మతులకు గురవుతోంది. నుచ్చుమిల్లి, ఆనందపురం, నాగభూషనపురం, మూలపేట గ్రామాల్లో రోడ్డు పరిస్థితి మరింత దిగజారిపోయింది.

* పెద ఎడ్లగాడి -ఉనికిలి రోడ్డు నిర్మించి 20 ఏళ్లు గడుస్తోంది. తారురోడ్డు నిర్మించినా నేడు దాని నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్డుపై ఎదురెదురుగా వాహనాలను తప్పించే వీలు లేకపోవడంతో దూరంగా నిలిపి ఒక వాహనం వచ్చిన తర్వాత రెండో వాహనం వెళ్లాల్సిన పరిస్థితి. ఉనికిలి, ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకలంక, మణుగునూరు గ్రామాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వర్షం వస్తే కనీసం ద్విచక్రవాహనం వెళ్లే పరిస్థితి లేదు.. * కైకలూరు మండలం ఆలపాడు నుంచి వడ్లకూటితిప్ప రోడ్డు సైతం మరమ్మతులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈ మార్గం ద్వారానే కొల్లేటికోట పెద్దింట్లమ్మవారిని దర్శించుకునేందుకు వీలుంటుంది. కాని ఇది పాడవడంతో ప్రయాణికులతో పాటు యాత్రికులకు ఇబ్బందులు తప్పడం లేదు.. * శృంగవరప్పాడు, పందిరిపల్లి గూడెం, గుమ్మళ్లపాడు, గోకర్ణపురం రహదారి కూడా దారుణంగా ఉంది. కొల్లేరు పరిధిలో ఉండడంతో అధికారులు వీటిని పట్టించుకోవడం మానేశారు.

అంచనాలు రూపొందించాం

ఇప్పటికే కొన్ని రహదారుల మరమ్మతలకు అంచనాలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డు నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి అనుమతులు ఉండకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. - రాజశేఖర్‌ ఏఈ, రోడ్లు, భవనాల శాఖ

ఇదీ చదవండి

వృద్ధులపై నేరాలు పెరిగాయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.