ETV Bharat / state

కృష్ణా జిల్లాలో నీటమునిగిన పంటలు

నివర్ తుపాను రైతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా జిల్లాలో పంటలు చేతికొచ్చిన వేళ వర్షాలు పడటంతో పంటలన్నీ పాడయ్యాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీటిలో మునిగాయి.

crop  submerged in water  at krishna district
కృష్ణా జిల్లాలో నీటమునిగిన పంటలు
author img

By

Published : Nov 27, 2020, 8:46 PM IST

కృష్ణా జిల్లాలో నివర్ తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా... సుమారుగా 3లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట వానలకు పాడైంది. తుపాన్ ప్రభావంతో పంట కాల్వలు, మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. వరి పంట దాదాపుగా నేలకొరిగింది. అధిక ఖర్చుతో కోయించిన వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

బాపులపాడు

కృష్ణా జిల్లాలో నీటమునిగిన పంటలు

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా మండలాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలోని బాపులపాడు మండలం, విజయవాడ రూరల్ మండలాల్లో కోతకు వచ్చిన పంట తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని రైతన్నలు కోరారు.

మైలవరం

నివర్ తుపాను ప్రభావంతో మైలవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షపాతం 48.2గా నమోదయ్యింది. పత్తితీసే దశ, వరి కోతకు వచ్చిన సమయంలో అకాలవర్షాలు పడ్డాయని అన్నదాతలు వాపోయారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న తడిసింది

ఇదీ చూడండి. చిత్తూరు జిల్లాలో భారీవర్షాలు..పొంగుతున్న వాగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.