నివర్ తుపాను కారణంగా కృష్ణాజిల్లా గన్నవరంలోని ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కోత అనంతరం ఎండబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాపులపాడు మండలం వీరవల్లి, రంగన్నగూడెం పంట పొలాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పాడవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసరపల్లి-సావరగూడెం ప్రధాన రహదారి వెంట సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఎటు చూసినా ఆరబెట్టిన ధాన్యమే కనిపిస్తోంది.
ఇదీ చదవండి: రేషన్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం.. సామాన్యులపై పెనుభారం