కృష్ణా జిల్లా విజయవాడ నగర శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రామవరప్పాడు సిండికేట్ బ్యాంక్ కాలనీలో ఆంజనేయులు, ఇంతియాజ్, రవూఫ్ ఇల్లు అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రాజేంద్ర అనే వ్యక్తి నుంచి ఆన్ లైన్ లింక్ ద్వారా విజయవాడలో దందా సాగిస్తున్నాడు. సెల్ ఫోన్ ఆధారంగా పందెంరాయుళ్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ. లక్షా 70 వేలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: