ETV Bharat / state

'అమరావతి విషయంలో వైకాపా మోసం చేస్తే.. భాజపా ద్రోహం చేసింది' - విజయవాడలో సీపీఎం నిరసన

రాష్ట్రంలో ప్రజలు, అమరావతి రైతులు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నా.. సీఎం జగన్ మొండిగా మూడు రాజధానులు చేస్తాననడం అన్యాయమని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. అమరావతిపై గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో ధర్నా చేపట్టారు.

cpm protest against governor decession on amaravathi in vijayawada
విజయవాడలో సీపీఎం నిరసన
author img

By

Published : Aug 1, 2020, 12:45 PM IST

అమరావతి రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ విజయవాడలో సీపీఎం నిరసన చేపట్టింది. రాజధాని విషయంలో వైకాపా మోసం చేస్తే, భాజపా ద్రోహం చేసిందని ఆ పార్టీ నేత సీహెచ్ బాబురావు విమర్శించారు.

బాబురావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా గుర్తించారన్నారు. నాడు ఒప్పుకుని నేడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జగన్​కు తగదన్నారు. రాష్ట్రంలో ప్రజలు, అమరావతి రైతులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నా ఏకపక్షంగా, మొండిగా 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ చేయించాలని కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అంటూ ప్రశ్నించారు.

ఇవీ చదవండి..

గోమాత మాతృ హృదయం.. మేకపిల్లలకు పాలిస్తోన్న ఆవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.