ఇంటింటీకి రేషన్ అనేది భారతంలో పద్మవ్యూహంలా మారిపోయిందని.. ప్రజలు పద్మవ్యూహంలో సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. విజయవాడలో రేషన్ ఫథకం వల్ల ఇబ్బందులపై ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంటింటికి రేషన్ పథకం విఫలమైందని అన్నారు. వాలంటీర్, డిపో, డోర్ డెలివరీల వల్ల ప్రజలకు ఎటు వెళ్లాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చెయ్యాలని.. గతంలో ఉన్న డిపోల ద్వారానే రేషన్ అందించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: