ETV Bharat / state

'రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 6 నెలలు నిత్యావసరాలు ఇవ్వాలి' - lock down in ap

రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలకు ఆహారం, రవాణా ఏర్పాటు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. పెంచిన విద్యుత్ బిల్లులు ఉపసంహరించుకోవాలని కోరింది. కేరళ తరహాలో కనీసం 6 నెలల పాటు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

cpm demands
cpm demands
author img

By

Published : May 16, 2020, 8:44 PM IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు కనీస నిత్యావసరాలు సరఫరా చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. మద్యం సరఫరా చేస్తూ ఆదాయం పెంచుకుంటుందని ఎద్దేవా చేశారు. కేరళ తరహాలో కనీసం 6 నెలల పాటు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రజలకు నిత్యావసరాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ చార్జీలపై 18వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సబ్ స్టేషన్​లు, ఆస్పత్రులు, పాఠశాలలు కట్టడానికి భూముల్లేని పరిస్థితుల్లో.. అభివృద్ధి పేరుతో ఉన్న భూములను అమ్మాలని చూడడం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ముందెన్నడూ అభివృద్ధి కోసం భూములు అమ్మడం అనేది చూడలేదని దీన్ని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.