పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అధికార వైకాపా మినహా అన్ని పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాయని గుర్తు చేశారు. పార్టీల విజ్ఞప్తిని ఎస్ఈసీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను నిర్వహించారని విమర్శించారు. కరోనా ఉద్ధృతి తగ్గాక కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు.
ఇదీ చదవండి