ETV Bharat / state

Cpi Ramakrishna: 'భూముల కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి'

వైకాపా నేతలు, రెవెన్యూ అధికారులు.. పేదలకు అవసరమైన ఇళ్ల కొనుగోళ్లలో రూ. 2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్​కు తెలుసన్నారు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి కడుతున్న కాలనీలకు జగన్‌ పేరు ఎందుకని ప్రశ్నించారు.

cpi leader ramakrishna
cpi leader ramakrishna
author img

By

Published : Jul 24, 2021, 7:22 AM IST

రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామ పట్టణ పరిధిలోని అనాసాగరం వద్ద వరదలో మునిగిన 22 ఎకరాల జగనన్న కాలనీని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, తెదేపా నాయకులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ... మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి రూ.రెండు వేల కోట్లు మాయం చేశారన్నారు.

ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కూడా తెలుసని సైతం ఆయన పేర్కొన్నారు. అనాసాగరంలో ఎకరానికి రూ.11 లక్షల చొప్పున కాజేశారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి కడుతున్న కాలనీలకు జగన్‌ పేరు ఎందుకని ప్రశ్నించారు. రెండు వారాల్లోపు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని, లేకపోతే ఆగస్టు పది నుంచి 15వ తేదీలోపు తామే గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు.

ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి

ధాన్యం రైతుల బకాయిలను సత్వరమే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రామకృష్ణ లేఖ రాశారు. ధాన్యాన్ని సేకరించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని, దాదాపు రూ.మూడు వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

visakha steel: ఉక్కు పరిశ్రమ అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి: ఎంపీ విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.