ETV Bharat / state

వైకాపా మోసం చేస్తే, భాజపా ద్రోహం చేసింది: సీపీఐ

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైకాపా మోసం చేస్తే, భాజపా ద్రోహం చేసిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మండిపడ్డారు.

cpi followers protest in vijayawada in amaravathi capital issue
విజయవాడలో సీపీఐ ధర్నా
author img

By

Published : Aug 2, 2020, 3:57 PM IST

అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా ఆమోదించిన సీఎం జగన్​ను ప్రశ్నించే దమ్ము కృష్ణా జిల్లా మంత్రులకు లేదా అని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. వైకాపా మోసం చేస్తే, భాజపా ద్రోహం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే వైకాపా నాయకులు పాలాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన 29 వేల 500 మంది రైతులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు తమ నాయకుడు అన్యాయం చేస్తుంటే రైతు బిడ్డగా మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పలువురు వైకాపా ఎమ్మెల్యేలు నిజమైన కృష్ణా జిల్లా వాసులైతే... రాజధాని అంశంలో జరుగుతున్న అన్యాయాన్నిఅడ్డుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

' కరోనా కమ్మేస్తుంటే వైకాపా నాయకుల హడావిడి... జాగ్రత్తలు పట్టవా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.