ETV Bharat / state

జగ్గయ్యపేటలో పెరుగుతున్న కరోనా కేసులు

author img

By

Published : Aug 7, 2020, 12:09 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గడిచిన పక్షం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. జగ్గయ్యపేట పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం కేసులు ఉద్ధృతం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

covid cases in krishna dst jaggayapeta are increasing

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 235 కేసులు నమోదు అయ్యాయి. వారిలో 27 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. జగ్గయ్యపేట పట్టణం ,పెనుగంచిప్రోలు, గ్రామంలో ఇద్దరు కొవిడ్ బారిన పడి మృతి చెందినట్లు వైద్యశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

ఇవి కాకుండా జగ్గయ్యపేట పట్టణంలో సుమారు వందమంది కొవిడ్ బారినపడి స్వీయ నిర్భంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో పలు గ్రామాల ప్రజలు వ్యాధిబారిన పడినవారు విజయవాడ, ఖమ్మం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ప్రైవేటు వైద్య సేవలు పొందుతున్నారు.

  • స్థానికంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి.. పరీక్షలు పెంచాలి

జగ్గయ్యపేట ప్రాంతం విజయవాడ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన వారికి కరోనా పాజిటివ్ వస్తే విజయవాడలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. బాధితులు అక్కడికి వెళ్ళటానికి ఒక్కోసారి వాహన సదుపాయం కూడా ఉండటం లేదని వాపోతున్నారు. అష్టకష్టాలు పడి వెళ్లినా అక్కడ మంచాలు దొరకటం లేదని చెబుతున్నారు. అందుకే జగ్గయ్యపేట ప్రాంతంలో అన్ని సదుపాయాలతో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా పరీక్షలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి

రాష్ట్రానికి ఇ-పంచాయత్‌ పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.