ETV Bharat / state

తెలంగాణలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. భాగ్యనగరంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 49 పాజిటివ్ కేసులు నమోదుకాగా... అందులో 38 జీహెచ్​ఎంసీ పరిధిలోనే కావడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కోరల్లో చిక్కుకుని అభం శుభం తెలియని పసికందు మృతి చెందాడు. ఆ రాష్ట్రంలోని మూడు జిల్లాలు మినహా మిగతా 28 జిల్లాల్లో కరోనా మహమ్మారి విస్తరించింది.

తెలంగాణలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు
తెలంగాణలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు
author img

By

Published : Apr 20, 2020, 6:33 AM IST

తెలంగాణలో కరోనా కలవరం... 858కి చేరిన కేసులు

తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొత్తం కరోనా కేసుల్లో సగానికి పైగా భాగ్యనరంలోనే నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వం నగరంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం కనిపించటంలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 858 మందికి కరోనా సోకగా... వీరిలో 486 మంది జీహెచ్​ఎంసీ పరిధిలోని వారే కావడం గమనార్హం. నగరంలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని సర్కారు... ఇప్పటికే 151 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు.... ప్రజలకు అవసరమై సామగ్రిని ఇంటికే పంపిస్తున్నారు. అయినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడంలేదు.

ఆదివారం ఒక్కరోజే 49 కేసులు..

ఆదివారం నమోదైన 49 కేసులు సహా ఇప్పటి వరకు రాష్ట్రంలో 858 మందికి కరోనా సోకింది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు ఈ మహమ్మారికి బలైనట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 651 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని అభం శుభం తెలియని పసికందు మృతి చెందాడు. నారాయణపేట జిల్లాకు చెందిన రెండునెలల బాబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

మూడు జిల్లాలు మినహాయిస్తే..

రాష్ట్రంలోని వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి మినహా 28 జిల్లాల్లో కరోనా మహమ్మారి విస్తరించింది. తొలుత అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కరీంనగర్ కేసుల నియంత్రణలోనూ.. మొదటిస్థానంలో ఉంది. అక్కడ అమలు చేసిన పద్ధతులను సర్కారు భాగ్యనగరంలోనూ అమలు చేస్తోంది.

మరింత కఠినంగా..

కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సర్కారు.. ఇకపై నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ప్రజలు తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.