ETV Bharat / state

కృష్ణా జిల్లాలో కరోనా ఉద్ధృతి

author img

By

Published : Apr 27, 2020, 7:45 AM IST

కృష్ణా జిల్లాలో 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 179కి చేరాయి. గుంటూరుకు చెందిన రెండు కేసులు నూజివీడులో నమోదవ్వడంతో వాటిని ఆ జిల్లాకు బదిలీ చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 177కు చేరింది. వీటిలో విజయవాడ నగరంలోనే 150 కేసులున్నాయి. జిల్లాలో నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం విజయవాడలోనే ఉన్నాయి.

corona effected in krishna
కృష్ణా జిల్లాలో కరోనా ఉద్ధృతితో పోలీసుల హెచ్చరికలు

కృష్ణా జిల్లాలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకూ జిల్లాలో 52 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 179కి చేరాయి. గుంటూరుకు చెందిన రెండు కేసులు నూజివీడులో నమోదవ్వడంతో వాటిని ఆ జిల్లాకు బదిలీ చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 177కు చేరింది. వీటిలో విజయవాడ నగరంలోనే 150 కేసులున్నాయి. జిల్లాలో నమోదైన మొత్తం కేసుల్లో 80శాతం విజయవాడలోనే ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ మరో 20కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు సోమవారం బులెటిన్‌లో విడుదల కానున్నాయి. గత మూడు రోజుల్లోనే కృష్ణా జిల్లాలో 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో విజయవాడలోని కృష్ణలంక, కార్మికనగర్‌లోనే 50కు పైగా కేసులు మూడు రోజుల్లో వెలుగుచూశాయి.

పదిన్నర లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరంలో ఇప్పటికే 150 కరోనా పాజిటివ్‌ కేసులు దాటిపోవడం అంటే.. ఆందోళనకర పరిణామమే. అధికారులు ఎంతలా కట్టడికి ప్రయత్నం చేస్తున్నా జనం విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేయడం, మార్కెట్లలో కిక్కిరిసిపోవడం, భౌతిక దూరం మరచిపోవడం వల్లే తీవ్ర స్థాయిలో వ్యాప్తి జరుగుతోంది. ఉదయం వేళ 6గంటల నుంచి 9గంటల వరకూ నిత్యావసరాల కొనుగోలు కోసం ఇస్తున్న మూడు గంటల సమయంలో జనం విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. ఒకసారి బయటకు వస్తే ఓ వారానికి సరిపడా సరకులు కొనుగోలు చేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. కానీ నిత్యం పని ఉన్నా లేకున్నా అవకాశం ఉంది కదా అని బయటకు వచ్చేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు నగరంలోని అన్ని కాలనీల్లోనూ జనం ఎదురింటికి పక్కింటికి వెళ్లి.. క్యారమ్స్‌, చెస్‌, అష్టాచెమ్మా, హౌసీ, పేకాట లాంటి ఆటలు ఆడుతూ టైంపాస్‌ చేస్తున్నారు. ఇది కూడా తీవ్ర వ్యాప్తికి మరో కారణంగా మారుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కృష్ణలంకలో ఒక వ్యక్తి హౌసీ, పేకాట ఆడించి 24 మందికి వైరస్‌ను అంటించాడంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందుకే జిల్లా మంత్రులు, కలెక్టర్‌ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఎవరి ద్వారా వైరస్‌ సోకుతుందో కూడా తెలియని కేసులు సైతం భారీగా పెరుగుతున్నాయి. విజయవాడలో పూర్తిగా లాక్‌డౌన్‌ను పాటించకపోతే పరిస్థితిని అదుపు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా వచ్చిన కేసులివీ..
కృష్ణా జిల్లాలో ఆదివారం వచ్చిన 52 పాజిటివ్‌ కేసుల్లో విజయవాడ నగరంలోని కార్మికనగర్‌లో 20, కృష్ణలంకలో 7, గాంధీనగర్‌లో 5, మధురానగర్‌లో 4, కేదారేశ్వరపేటలో 2, గులాబీతోట, రామవరప్పాడు, విద్యాధరపురంలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పెనమలూరు మండలంలోని చోడవరంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ముగ్గురు, వారి ఇంటిలో పనిమనిషి కలిపి నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. కానూరు పరిధిలోని సనత్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఉంగుటూరు మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన ఓ మహిళకు సైతం పాజిటివ్‌ వచ్చింది. ఈమె విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆసుపత్రికి ఇటీవల కరోనా లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి అనారోగ్యంతో వచ్చాడు. ఈమె, విజయవాడ సీతారాంపురానికి చెందిన మరో వ్యక్తికి అతని ద్వారా వైరస్‌ సోకింది. మరో నాలుగు కేసులు జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న ఇతర ప్రాంతాలకు చెందిన వారికి వచ్చాయి.

ఇవీ చూడండి...

'పబ్లిసిటీ మాని కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.