కృష్ణా జిల్లా విజయవాడ పరిధిలోని పోరంకి శ్రీనివాస్ నగర్లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి డ్రోన్ ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే పని చేస్తుంటాడు. అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. స్థానిక సీఐ సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి.. సరిహద్దుకు కూలీలు... పరిమితంగా అనుమతులు!