ETV Bharat / state

తిరుపతమ్మ ఆదాయంపై కరోనా ప్రభావం.. తగ్గిన 40% ఆదాయం - పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం తాజా వార్తలు

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో కొవిడ్​ కారణంగా ఆదాయం క్షీణించింది. ఈ ప్రభావం సేవలు, సిబ్బంది జీతభత్యాల పై పడుతోంది. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కూడా వీటి ప్రభావం అధికంగా ఉంటోంది.

Tirupatamma temple
తిరుపతమ్మ ఆలయం
author img

By

Published : Apr 26, 2021, 3:29 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. 2019- 20, 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 40 శాతం ఆదాయం తగ్గిపోయింది. ఆ ప్రభావం దేవాలయంలోని సేవలు, సిబ్బంది జీతభత్యాల పై పడుతోంది. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం చూపుతోందని దేవాలయ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి ప్రధాన ఆదాయ వనరులైన హుండీలు, దుకాణాల లీజులు, టికెట్లు లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో ఆదాయం గణనీయంగా పడిపోయింది. హుండీ ఆదాయం కొంత పర్వాలేదనిపించినా దుకాణాల లీజులు, టికెట్లు లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో ఆదాయం క్షీణించింది.

ఖర్చులు తగ్గించారు
దేవాలయానికి సగటున రూ. 12 కోట్లు వార్షిక ఆదాయం వచ్చేది. అందుకు అనుగుణంగా అధికారులు ఖర్చులు పెడుతుంటారు మిగతా దేవస్థానాల కంటే భిన్నంగా తిరుపతమ్మ ఆలయంలో రెండేళ్లకు ఒక మారు రంగుల ఉత్సవం, ఏడాదికి రెండు సార్లు పెద్ద, చిన్న తిరునాళ్లు, గ్రామ దేవతల కొలువులు ఉంటాయి. వాటితో పాటు ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ. కోట్లలో నిధులు వెచ్చించాల్సి ఉంది. కొవిడ్ కారణంగా ఆదాయం 40 శాతం పడిపోవడంతో అదే స్థాయిలో ఖర్చులు కూడా తగ్గించారు. అధికారులు సిబ్బంది కలిపి 139 మంది ఉన్నారు. వారికి ఏడాదికి రూ. రెండు కోట్ల వరకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉండగా 10 శాతం కోత విధించారు. పెద్ద ,చిన్న తిరునాళ్ళలో ఆడంబరపు ఖర్చులు తగ్గించారు.

రాబడి వివరాలు (రూ. కోట్లలో)

2019-20 2020-21తగ్గుదల
హుండీలు2.75 2.17 0.58
లీజులు 2.97 1.60 1.37
ప్రసాదాలు4.33 2.28 2.05

గత మూడేళ్లలో దేవాలయ వార్షికాదాయం రూ కోట్లలో

2019-20: 12.05

2020-21: 10.88

2021-22: 6.70

ఇదీ చదవండీ.. పిల్లలపై కొవిడ్‌ పిడుగు.. 45 రోజుల్లోనే 5 వేల మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.