కరోనా రోగులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం నియమించిన వైద్యులు, నర్సులు, సహాయకులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. తమను ప్రభుత్వం ఉన్నపళంగా విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తగ్గుతుందనే సాకుతో విధుల నుంచి తొలగించారని.. అన్ని అర్హతలూ ఉన్న తమను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమించుకోవాలని కోరారు. తమను ఉద్యోగాల నుంచి తీసివేయడం ఎంతవరకు సబబని అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'పరస్పరం సహకరించుకోవాలి'... ఎస్ఈసీ, సర్కార్కు గవర్నర్ సూచన