కృష్ణాజిల్లా అవనిగడ్డలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదు అయినట్లు మచిలీపట్నం రెవెన్యూ డివిజినల్ అధికారి ఖాజావలీ ప్రకటించారు. ప్రముఖ వాణిజ్య బ్యాంకు ఉన్న ఏరియాలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయని తెలియడం బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. దివిసీమలో ఇదే ప్రధాన శాఖ కావడం.. బ్యాంకు ఉన్న ప్రాంతం కంటైన్మెంట్ జోన్ చేయడం.. బ్యాంకు కార్యకలాపాలు నిలచిపోనున్నాయి. పంచాయతీ అధికారులు బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేస్తున్నారు.
ఇవీ చూడండి...