ఒకప్పుడు కరోనా కేసులు అత్యధికంగా నమోదైన కృష్ణాజిల్లాలో గణనీయంగా తగ్గాయి. అత్యధిక నిర్ధరణ పరీక్షలు, భౌతికదూరం పాటించటం, మాస్క్ ధరించటం, అవగాహన కార్యక్రమాలు చేయటం వలన పాజిటివ్ కేసులు తగ్గాయని అధికారులు చెపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం నాలుగు వేల కరోనా నిర్ధరణ పరీక్షలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారితో ఆశావర్కర్లు, స్థానిక పీహెచ్సీ కేంద్రాల నుంచి వైద్యులు సంప్రదించి కరోనా చికిత్స అందిస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
ఇదీ చూడండి