ETV Bharat / state

కృష్ణా జిల్లాలో 338కి చేరిన కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం

కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 338కి పెరిగింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గత 24 గంటల్లో అత్యధికంగా 16 కేసులు నమోదైన జిల్లాగా నిలిచింది. ఈ కేసుల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ విజయవాడ నగర పరిధిలోనివే. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు లాక్​డౌన్​ పక్కాగా అమలు చేస్తున్నారు.

కరోనా కేసుల పెరుగుదల...అధికారుల అప్రమత్తత

author img

By

Published : May 9, 2020, 10:21 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ జిల్లాలో 338 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం ఆర్​అండ్​బీ అతిథి గృహంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య కలెక్టర్​తో కలిసి జిల్లాలోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. జిల్లాల్లో టెస్టింగ్‌ సౌకర్యాలు, ట్రూనాట్‌ కిట్లు అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నంలో మూడు కంటైన్మెంట్ జోన్లలో ఒక కంటైన్మెంట్ జోన్ సాధారణ స్థాయికి చేరుకుందని- త్వరలోనే గ్రీన్ జోన్​గా మారనుందన్నారు. అలాగే రెండో కంటైన్మెంట్ జోన్ వెరీ యాక్టివ్ దశ నుంచి యాక్టివ్ దశకు వచ్చిందన్నారు. మరి కొద్ది కాలంలో అక్కడ సైతం సాధారణ స్థితికి వస్తుందన్నారు. మూడో కంటైన్మెంట్ జోన్‌లో కొత్తగా ఓ కేసు రావడం వల్ల లాక్‌డౌన్‌ ప్రామాణికాలు కచ్చితంగా పాటించాలని మచిలీపట్నం ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్​ కమిషనర్లను ఆదేశించారు.

జిల్లాకు వచ్చే విదేశీయుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నాలుగు వేల మంది వలస కూలీలను మహారాష్ట్రకు అత్యంత జాగ్రత్తలు తీసుకొని పంపించామన్నారు. అలాగే వెయ్యి మందిని బస్సుల్లో రాజస్థాన్ తరలించామని చెప్పారు.

అనుమతులతో కృష్ణా జిల్లాకు వచ్చేవారిని క్వారంటైన్​లలో విధిగా ఉంచి తగిన విధమైన స్క్రీనింగ్ , పరీక్షలు జరిపిన తర్వాతనే వారి ఇళ్లకు పంపిస్తామన్నారు. కృష్ణలంక, మాచవరం కార్మికనగర్‌ ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా మారినందున వాటిని తమ ఆధీనంలోకి తీసుకుని మరింత పకడ్భందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.