దేశంలో కరోనా కేసుల సంఖ్య చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతోంది. అయినా కొన్ని జిల్లాల్లో కొవిడ్-19 తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. తాజాగా విజయవాడలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 25కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశారు. వైరస్ వ్యాపించేందుకు వీలున్న అన్ని మార్గాలను మూసివేశారు. ముఖ్యంగా ఆదివారం , మాంసాహార దుకాణాల వద్ద నగరవాసులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతుండడం, భౌతికదూరాన్ని పాటించకపోవడాన్ని గుర్తించిన అధికారులు మాంసాహార దుకాణాలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇవాళ విజయవాడ పరిధిలో అన్ని మాంసాహార దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించి ఎవరైనా దుకాణాలు తెరిచి ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
ఇవీ చూడండి