ETV Bharat / state

ప్రభుత్వం కొనుగోలు చేయక.. ప్రైవేట్​ వ్యాపారులకు అమ్మలేక... - మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు

కృష్ణాజిల్లా నందిగామలో మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు సగమే పంట కొనుగోలు చేసిందని.. ఇంకా సగం పంట మార్కెట్​లోనే ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు మరింత తక్కువకు అడుగుతున్నారని.. వారికి అమ్మలేక ప్రభుత్వం కొనుగోలు చేయక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

corn farmers facing problems over crop selling
నందిగామలో మొక్కజొన్న రైతుల ఆందోళన
author img

By

Published : Jan 6, 2021, 3:47 PM IST

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో కాటా మొదలై రోజులు గడుస్తున్నా.. కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ కృష్ణా జిల్లాలోని నందిగామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలలో మాత్రం జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాటా వేసిన మొక్కజొన్నలు రోజులు గడుస్తున్నా ఎత్తకపోవడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనిపై రైతులు అధికారులను ప్రశ్నిస్తే.. తమకు ఇచ్చిన కొనుగోల్లు కేటాయింపు పూర్తయిందని చెప్పారు. తిరిగి కేటాయించిన తరువాత తీసుకెళ్తామని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.

దీనిని అదనుగా చేసుకుని మొక్కజొన్నలు ప్రైవేట్ వ్యాపారులు మరింత తక్కువకు అడుగుతున్నారని అటు వారికి అమ్మలేక ప్రభుత్వం కొనుగోలు చేయక దిక్కు తోచని స్థితిలో నందిగామ రైతులు ఉన్నారు. మండలంలో ఇప్పటి వరకు కేవలం సుమారు 30000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని.. ఇంకా 30వేల క్వింటాళ్ల పై చిలుకు మొక్కజొన్నలు రైతు వద్దనే ఉన్నాయని తెలుపుతున్నారు. ఇప్పటికైనా రైతుల వద్ద ఉన్న మొక్క జొన్నలను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఆస్తి పన్ను పెంపు జీవోను రద్దు చేయాలని నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.