కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య గల కనకదుర్గ వారధిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వైకాపా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూ ఊరుకోం, ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు’ అనే వ్యాఖ్యలున్న ఈ ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే జోగి రమేష్ ఫొటోలున్నాయి. వైఎస్‌ఆర్‌టీయూసీ నాయకుడు మాదు శివరామకృష్ణ పేరుతో ఇవి వెలిశాయి.
ఇదీ చదవండి: రాజధానిలో 32 శాతం భూములు ఎస్సీ, ఎస్టీలవే.. హైకోర్టులో పిల్